రీసెంట్‌గా ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటరైన హీరోయిన్ సమీరారెడ్డి చిక్కుల్లోపడింది. ఈమెపై తమిళతంబీలతోపాటు కోలీవుడ్ కాస్త గుర్రుగానే వుందని సమాచారం. ఇంతకీ ఈమె ఏం చేసిందో తెలుసా..? శ్రీలంకలో తమిళుల ఊచకోతపై తమిళనాడు ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే! చివరకు అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేను సైతం తిరుమలలో అడ్డుకోవడానికి నానాప్రయత్నాలు చేశారు.
తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కొడుకు నమల్ రాజపక్సే - సమీరారెడ్డి కలిసివున్న ఓ స్టిల్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోపై ఇప్పుడు తమిళులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాల్లేనప్పుడు సమీరాని కోలీవుడ్ ఆదుకుంది. ఇప్పుడు ఈ ఫొటో ఆమె కెరీర్‌ను దెబ్బతీయడం ఖాయమని ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు. ఒకవేళ తమిళంలో ఈమె నటిస్తే, ఆయా సినిమాలకు మరిన్ని చిక్కులు తప్పవని అనుకుంటున్నారు.
0 comments:
Post a Comment