Friday, 3 October 2014

Shruthi Hasan Aagadu Item song stills, Shruthi Hasan at pub secret mobile cam stills


ప్రస్తుతం వరుస హిట్స్‌తో జోష్ మీదున్న శృతిహాసన్ తాజాగా ఓ హీరోతో సీక్రెట్‌గా పార్టీ ఎంజాయ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'ఆగడు' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన శృతి ఆ తర్వాత ‘తేవర్’ అనే మరో హిందీ సినిమాలో ఐటమ్ సాంగ్‌కి స్టెప్పులేసింది. తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఒక్కడు’ సినిమాకి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో అర్జున్ కపూర్, సోనాక్షీ సిన్హా జంటగా నటిస్తున్నారు. అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
'తేవర్'లోని ఈ ఐటంసాంగ్‌లో అర్జున్‌తో కలిసి స్టెప్పులేసిన శృతిహాసన్ అందుకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు బాలీవుడ్‌లోనూ ఆమెకి బాగా క్రేజ్ వుండటంతో బోనీ కపూర్ కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. ఈ ఐటం సాంగ్ షూటింగ్ సందర్భంగా అర్జున్ కపూర్ బలవంతం చేయడంతో శృతి కూడా అతనితో కలిసి పార్టీని ఎంజాయ్ చేసిందని బాలీవుడ్ మీడియా టాక్. 

0 comments:

Post a Comment