Friday, 3 October 2014

Nithin New Movie Chinna Dani kosam Stills at europe


నితిన్‌ హీరోగా శ్రేష్ట్‌ మూవీస్‌ సంస్థ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘చిన్నదాన నీ కోసం’ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ యూరప్‌లో శరవేగంతో జరుగుతోంది. 35 రోజుల పాటు అక్కడ వర్క్‌ చేసిన యూనిట్‌ ఈ వారంలోనే హైదరాబాద్‌ తిరిగి రానుంది. దీంతో తొంభై శాతం చిత్రం పూర్తవుతుందనీ, మిగిలిన టాకీ పార్ట్‌, ఒక పాటను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎన్‌.సుధాకరరెడ్డి చెప్పారు. డిసెంబర్‌ 19న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘మా గత చిత్రాలు ‘ఇష్క్‌’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ మించి సంగీతాన్ని అనూప్‌ రూబెన్స్‌ అందించారు. ఆండ్రూ కెమెరా, హర్షవర్ధన్‌ మాటలు ఈ చిత్రానికి ప్లస్‌ అవుతాయని మరో నిర్మాత నికితారెడ్డి చెప్పారు. మిస్ఠి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. సమర్పణ: విక్రమ్‌గౌడ్‌.

0 comments:

Post a Comment