వానాకాలం వాతావరణంలో తేమ, తడి ప్రభావం వల్ల చర్మ సమస్యలు తెలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కాలంలో చర్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. హఠాత్తుగా ముఖ చర్మం జిడ్డుగా తయారైనా, ముఖంపై మొటిమలు మొదలైనా కంగారు పడకుండా కొన్ని హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్స్‌ను వేసుకోవాలి. వీటి వల్ల చర్మం పూర్వపు తాజా దనాన్ని తిరిగి పొందుతుంది.
శాండిల్ ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ గంథం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, అర టీస్పూన్ పసుపు తీసుకుని ఈ మూడింటిని కలిపి ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలాగి చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై నలుపు తొలిగి తాజాగా తయారవుతుంది.
ఓట్‌మీల్ ప్యాక్
3 టేబుల్ స్పూన్ల ఓట్‌మీల్., 1 ఎగ్ వైట్, 1 టీస్పూన్ తేనె, 1 టీ స్పూన్ పెరుగులను బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెటాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి.
సా్ట్రబెర్రీ ప్యాక్
4 - 6 సా్ట్రబెర్రీలు (గుజ్జు), 2 టీస్పూన్ల బ్రెడ్ ముక్కలు, 2 టీ స్పూన్ల ఫుల్లర్స్ ఎర్ట్, కొద్దిగా నీరు తీసుకుని అన్నిటినీ కలిపి ముఖానికి పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
పుదీనా ప్యాక్
పుదీనా, అరటి పండుతో కూడా ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం గుప్పెడు పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సగం అరటిపండును గుజ్జుగా చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాలాగి కడిగేసుకోవాలి.
బియ్యం పిండి ప్యాక్
బియ్యం పిండి లేదా బాదం పొడి, పెరుగులను పేస్ట్‌లా కలుపుకోవాలి. నిద్రకు 15 నిమిషాల ముందు ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి పూర్తిగా ఆరాక చేత్తో రుద్ది ప్యాక్‌ను తొలగించాలి.
ఎగ్ ప్యాక్
ఎగ్ వైట్, 1 టీస్పూన్ తేనెలను కలుపుకుని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.
బొప్పాయి ప్యాక్
5-6 బొప్పాయి ముక్కలు, 1 టీస్పూన్ బ్రౌన్ షుగర్‌లను బాగా ముద్దగా కలిపి ముఖానికి అప్పై చేసి సర్క్యులర్ మోషన్స్‌లో 5 నిమిషాలపాటు మసాజ్ చేయాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి.



0 comments:
Post a Comment