ముంబై :
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈమధ్య మహిళా సాధికారత గురించి ఓ షార్ట్ ఫిల్మ్ తీసింది. అప్పటినుంచి ఆ అంశం మీద పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోనాక్షి సిన్హా సాధికారతపై స్పందించింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో దీపికా పదుకొనే మహిళల స్వేచ్ఛ గురించి చెబుతుంది. వాళ్లకు ఏ విషయంలోనైనా స్వేచ్ఛ ఉండాలని.. పెళ్లికి ముందు లేదా పెళ్లి తర్వాత కూడా ఎవరితో సెక్స్ లో పాల్గొనాలి, ఎవరితో వద్దనే విషయం కూడా వారికి వారే నిర్ణయించుకోగలగాలని దీపిక అంటుంది.
సరిగ్గా ఈ విషయంలోనే ఆమెతో సోనాక్షి విభేదించింది. ''మహిళా సాధికారత అంటే నువ్వు ఏ తరహా దుస్తులు వేసుకుంటున్నావని కాదు, లేదా ఎవరితో సెక్స్ లో పాల్గొనాలి, ఇలాంటి చెత్త కాదు. అది మన ఉపాధి, బలం గురించి ఉండాలి'' అని సోనాక్షి చెప్పింది. దీపిక షార్ట్ ఫిల్మ్ గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది. అయితే.. అసలంటూ ఈ విషయంపై చొరవ చూపడం అభినందనీయమని, నిజంగా అవసరమైన వాళ్లకు తప్పనిసరిగా సాధికారత కల్పించాలని చెప్పింది. తమలాంటి వాళ్లు మంచి సౌకర్యాలు, విలాసాల్లో పుట్టి పెరిగారని, తమకు సాధికారత ప్రత్యేకంగా అవసరం లేదని ఆమె తెలిపింది.
Tags : దీపికా పదుకొనే షార్ట్ ఫిల్మ్, మహిళా సాధికారత, సోనాక్షి సిన్హా

0 comments:
Post a Comment