Wednesday, 27 August 2014

permenent solution for gastric problems, gastric problems solution

గ్యాసి్ట్రక్‌ సమస్యలు చాలామందిని బాధిస్తున్నాయి. పని ఒత్తిడితో పాటు ఆహార నియమాలు పాటించక పోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. శారీరక శ్రమ పెద్దగా లేని గృహిణుల్లో గ్యాసి్ట్రక్‌ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోమియోలో జెనిటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ వైద్య విధానం ద్వారా గ్యాసి్ట్రక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చంటున్నారు హోమియోవైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌.
ప్రపంచంలో 40 శాతం మంది జనాభా గ్యాసి్ట్రక్‌ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందులో 80 శాతం మంది నాన్‌ అల్సర్‌ డిస్పెప్సియా, జి.ఐ.ఆర్‌.డి.తో బాధపడుతున్నారు. మరో 20 శాతం మంది గ్యాసి్ట్రక్‌ అల్సర్స్‌, కేన్సర్‌ల బారిన పడుతున్నారు. గ్యాసె్ట్రటిస్‌ అంటే జీర్ణకోశం లోపల ఉండే మ్యూకోసల్‌ పొరల్లో ఇన్‌ఫ్లమేషన్‌కు గురైనపుడు ఆ ప్రదేశంలో వాపు, కమిలిపోవడం, నొప్పి వంటి లక్షణాలు ఏర్పడతాయి. దీన్నే గ్యాసె్ట్రటిస్‌ అంటారు. కొన్ని సందర్భాల్లో జీర్ణకోశంలో ప్రత్యేకించి ఏ వ్యాధి లేకపోయినా గ్యాస్టిక్‌ లక్షణాలను అనుకరించడాన్నే ఫంక్షనల్‌ లేదా నాన్‌ అల్సర్‌ డిస్పెస్సియా అని అంటారు. ఒత్తిడి, ఆందోళన మెదడుతోపాటు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపించటం వల్ల గ్యాసి్ట్రక్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
గ్యాసి్ట్రక్‌ సమస్యలు కొన్ని రోజులు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాసె్ట్రటిస్‌ అంటారు.దీర్ఘకాలికంగా ఈ సమస్య బాధిస్తే క్రానిక్‌ గ్యాసె్ట్రటిస్‌ అంటారు. గ్యాసి్ట్రక్‌ సమస్య ముదిరితే అల్సర్స్‌ లేదా పుండ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఇవి కేన్సర్‌కు దారితీయవచ్చు. 
కారణాలు: గ్యాసి్ట్రక్‌ ఇన్ఫెక్షన్‌లు హెలికోబాక్టర్‌ పైలోరై బ్యాక్టీరియాతో పాటు, మద్యం తాగడం, ఆస్పిరిన్‌, ఇతర పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా తీసుకోవటం వల్ల గ్యాసి్ట్రక్‌ సమస్యలు వస్తున్నాయి. మనం తిన్న ఆహారం జీవరసాయనాలతో కలిసి జీర్ణమవుతుంది. కొందరు ఒత్తిడికి లోనవడం వల్ల జీవరసాయనాలు అధికంగా ఉత్పత్తి అయి గ్యాసి్ట్రక్‌ సమస్యలు వస్తుంటాయి. పైత్యరసం వెనక్కి శ్రావించడం, వంశపారంపర్యంగా గ్యాసి్ట్రక్‌ సమస్య ఉండటం, సమయానికి ఆహారం తీసుకోకుండా అశ్రద్ధ చేయడం, టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవటం, ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటి పదార్థాలు ఎక్కువగా వాడటం, జన్యుపరమైన సమస్యలతో గ్యాసి్ట్రక్‌ సమస్యలు వస్తున్నాయి. 
లక్షణాలు : కడుపునొప్పి లేదా మంట. కడుపు పై భాగంలో వస్తుంది. కడుపు ఉబ్బరం, తేన్పులు రావటం, కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం, వికారం, ఆకలి లేకపోవడం, కొందరిలో గ్యాసి్ట్రక్‌ అల్సర్స్‌ కారణంగా మలం రంగు మారడం, రక్తం వాంతులు కావటం, నిద్ర పట్టక పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. 
నిర్ధారణ పరీక్షలు : రోగి లక్షణాలు, కుటుంబ చరిత్ర, రక్తపరీక్ష, రక్తంలో హెచ్‌బి శాతం తెలుసుకోవటం, మలం పరీక్ష, మలంలో రక్తకణాలు, బ్యాక్టీరియా హెచ్‌ పైలోరైవి పరీక్ష, ఎక్స్‌రే, ఎండోస్కోపి వంటి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సమయానికి ఆహారం తీసుకోవాలి. మద్యం, సిగరెట్లు, బీడీలు తాగటం మానేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. వేడి పదార్థాలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తీసుకోకపోవడం, తిన్న వెంటనే పడుకోకుండా కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. ఒత్తిడిని తగ్గించుకోటం ద్వారా గ్యాసి్ట్రక్‌ సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. 
హోమియో చికిత్స : గ్యాసి్ట్రక్‌ సమస్యలకు హోమియో చికిత్స మంచి పరిష్కారం చూపిస్తుంది. హోమియో మందులతో కడుపులో నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, తేన్పులు వంటి లక్షణాలను తాత్కాలికంగా తగ్గించటమే కాకుండా గ్యాసి్ట్రక్‌ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, జీవరసాయనాల అసమతుల్యతను తిరిగి సమతుల్యం చేసి జీర్ణవ్యవస్థను శక్తివంతంగా చేయవచ్చు. హోమియో చికిత్సతో గ్యాసి్ట్రక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

0 comments:

Post a Comment